team india: కోహ్లీ మాత్రమే కాదు...ధోనీ కూడా తొలిసారే!

  • టీ20ల్లో తొలిసారి డక్కౌట్ అయిన కోహ్లీ
  • టీ20ల్లో తొలిసారి స్టంప్ అవుట్ అయిన ధోనీ
  • జంపా తెలివిగా వేసిన బంతిని ఆడడంలో తడబడిన ధోనీ
గువహటి వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 48 టీ20 మ్యాచ్ ల తరువాత డక్కౌట్ అయిన ఆటగాడిగా కెప్టెన్ కోహ్లీ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ తో కోహ్లీ డకౌట్ కాగా, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా టీ20ల్లో తొలిసారి స్టంప్ అవుట్ అయ్యాడు.

ఆడమ్ జంపా వేసిన పదవ ఓవర్ ఐదో బంతిని ఆడేందుకు ధోనీ బాగా ముందుకు వచ్చాడు. అయితే ధోనీని బాగా గమనించిన జంపా.. పిచ్ సగంలో బంతి టర్న్ అయ్యేలా చేశాడు. అప్పటికే ముందుకు వచ్చిన ధోనీ, అది మరింత ముందుగా పిచ్ పై పడడంతో లిప్తపాటులో ఆలోచించాడు. అంతలో ఆ బంతి ధోనీని దాటుకుని కీపర్ చేతిలో పడింది. దీంతో అతను వికెట్లను గిరాటేశాడు. దీంతో ధోనీ టీ20ల్లో తొలిసారి స్టంప్ అవుట్ అయ్యాడు. 
team india
Australia cricket team
t20
kohli
dhoni
record

More Telugu News