ration shop: రేషన్ దుకాణం తలుపులు పగుల గొట్టించిన ఏపీ మంత్రి ప్రత్తిపాటి

  • ఉదయం 11 గంటలైనా తెరవని రేషన్ షాపు
  • ఆగ్రహంతో తలుపులు పగులగొట్టాలన్న ప్రత్తిపాటి
  • విశాఖ పట్నం ఆశీలుమెట్టలో ఘటన
ఈ ఉదయం విశాఖపట్నంలోని ఓ రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసేందుకు వచ్చిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఉదయం 11 గంటలు దాటుతున్నా, షాపు ఇంకా తెరవకపోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే రేషన్ షాపు తలుపులు పగులగొట్టి, సరుకులను బయట వేచివున్న లబ్దిదారులకు ఇవ్వాలని ఆయన ఆదేశాలు ఇవ్వడంతో, అధికారులు తలుపులు పగులగొట్టారు.

శ్రీనగర్, ఆశీలుమెట్ట తదితర ప్రాంతాల్లో రేషన్ దుకాణాలను ప్రత్తిపాటి తనిఖీ చేశారు. ఆశీలుమెట్ట సర్కిల్-2లోని 173వ దుకాణం తీయకపోవడంతో ఆగ్రహించి, దాన్ని తెరిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేషన్ దుకాణాలు తెరవకపోవడాన్ని, సరుకుల పంపిణీలో అవకతవకలను సహించేది లేదని అన్నారు.
ration shop
prathipati pullarao
vizag

More Telugu News