Russian: డబ్బు పోగొట్టుకుని.. కాంచీపురంలోని ఆలయం వద్ద రష్యా యువకుడి భిక్షాటన!

  • రష్యా నుంచి భారత పర్యటనకు వచ్చిన యువకుడు 
  • బస్సులో ప్రయాణిస్తుండగా పర్సు కొట్టేసిన దుండగులు
  • కుమరకొట్టం ఆలయం వద్ద భిక్షాటన
విహారయాత్రకు వచ్చిన విదేశీయుడు ఆలయం వద్ద భిక్షాటన చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... రష్యాకు చెందిన ఎవిక్ మీ అనే యువకుడు భారత్ ను సందర్శించేందుకు వచ్చాడు. వివిధ ప్రాంతాలు తిరుగుతూ తమిళనాడులోని కాంచీపురం చేరుకున్నాడు. అక్కడ బస్సులో ప్రయాణిస్తుండగా అతని పర్సును ఎవరో దొంగిలించారు.

దీంతో పశ్చిమ రాజవీధి కుమరకొట్టం మురుగన్‌ ఆలయం వద్ద టోపీ చాచి భిక్షాటన ప్రారంభించాడు. భారత దేశానికి విహారయాత్రకు వచ్చిన తన దగ్గర డబ్బులైపోయాయని, సాయం చేయాలని కోరాడు. దీంతో అతనిని అనుమానించిన పలువురు భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని, విచారించగా, విషయం వివరించాడు. దీంతో సబ్ ఇన్ స్పెక్టర్ తులసి అతనికి కొంత నగదు ఇచ్చి, చెన్నైకి పంపారు. 
Russian
Tamilnadu
kanchipuram
temple
begging

More Telugu News