Rahul Gandhi: రాహుల్ గాంధీ ఎంత చక్కగా డ్యాన్స్ చేశారో.. మీరూ చూడండి!

  • డ్రమ్ వాయిస్తూ చిందేసిన రాహుల్ 
  • గుజరాత్ పర్యటనలో హుషారుగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు
  • బీజేపీపై దుమ్మెత్తి పోస్తూ ముందుకు సాగుతున్న నేత
గుజరాత్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హుషారుగా కనిపిస్తున్నారు. గుజరాత్‌లో మూడు రోజుల పర్యటనలో ఉన్న ఆయన కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నారు. మంగళవారం చోటా ఉదయ్‌పూర్ జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయనకు పటీదార్ వర్గీయులు ఘనంగా స్వాగతం పలికారు.

స్థానిక కళాకారులు తిమ్లి నృత్యంతో రాహుల్‌ను ఆహ్వానించారు. వారు చేస్తున్న డ్యాన్స్ చూసి ముచ్చటపడిన రాహుల్ ఆయన కూడా కాలు కదిపారు. డ్రమ్ లాంటి వాయిద్య పరికరాన్ని వాయిస్తూ వారితో కలిసి సరదాగా స్టెప్పేశారు. రాహుల్ కూడా చిందేయడంతో కళాకారులు మరింత ఉత్సాహంగా నృత్యం చేశారు.

రాహుల్ గాంధీ సోమవారం రెండో దశ ‘నవసర్జన్’ యాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా రోడ్ షోలు, బహిరంగ సభలతో దూసుకుపోతున్నారు. బీజేపీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. నిరుద్యోగం, అవినీతి, జీఎస్టీ, నోట్ల రద్దు, మహిళా సాధికారత వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
Rahul Gandhi
Congress
Gujarat
Dance

More Telugu News