డేరా బాబాను కలవడానికి వచ్చిన తల్లి, కుమారుడు, కుమార్తె, అల్లుడు
- గుర్మీత్ తన కుటుంబాన్ని కలవడం ఇది రెండోసారి
- సెప్టెంబర్ 15న బాబాను కలిసిన తల్లి
- శిక్ష పడిన 45 రోజుల తర్వాత సందర్శనకు వచ్చిన ఇతర కుటుంబీకులు
తనను కలవడానికి వచ్చే 10 మంది పేర్లను డేరా బాబా పోలీసులకు ఇచ్చాడు. ఇందులో మొదటి పేరుగా హనీప్రీత్ని పేర్కొన్నాడు. ఆమె ఇటీవల అరెస్టైన సంగతి తెలిసిందే. ఇంగ్లిషు వర్ణమాల ప్రకారం బాబా ఇచ్చిన జాబితాలోని వాళ్లు సోమ, గురు వారాల్లో ఆయనను కలవవచ్చు. జైలు నిబంధనల ప్రకారం దోషిగా తేలిన వ్యక్తి కాబట్టి వారానికి ఒకసారి మాత్రమే కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఉంటుంది. తన కుటుంబ సభ్యులతో అరగంటపాటు మాట్లాడిన బాబా ఉద్వేగానికి లోనయినట్లు సమాచారం.