స్మగ్లింగ్ రూటే సెపరేటు... విమానంలోని 29 మంది ప్రయాణికుల కడుపులో 30 కేజీల బంగారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్మగ్లింగ్ రూటే సెపరేటు... విమానంలోని 29 మంది ప్రయాణికుల కడుపులో 30 కేజీల బంగారం!

  • దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో స్మగ్లర్లు
  • 29 మంది పొట్టలో బంగారం ఉన్నట్టు గుర్తించిన కస్టమ్స్ అధికారులు
  • 30 కేజీల బంగారాన్ని కక్కించిన అధికారులు
స్మగ్లర్లు వేసే ఎత్తులకు కస్టమ్స్ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. దేశంలోని ఏదో ఒక విమానాశ్రయంలో స్మగ్లర్లు నిత్యం పట్టుబడుతున్నప్పటికీ వారు కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా, తమిళనాడులోని మధురై విమానాశ్రయంలో 30 కేజీల బంగారాన్ని ప్రయాణికులు తరలించిన విధానం చూసి కస్టమ్స్ అధికారులు ఆశ్చర్యపోతున్నారు.

దుబాయ్‌ నుంచి మధురై విమానాశ్రయానికి వచ్చిన విమానంలో 29 మంది ప్రయాణికుల కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో వారిని స్కానింగ్ చేయగా, వారందరి కడుపులో బంగారం ఉండడం విశేషం. పాలిథీన్ కవర్ లో బంగారాన్ని పెట్టి వీరు మింగేశారు. వారిని ఆసుపత్రికి తరలించి, వారి నుంచి 30 కేజీల బంగారాన్ని కక్కించారు. అనంతరం వారందర్నీ అరెస్టు చేసి, విచారణ ప్రారంభించారు.  
gold smuggling
mathurai air port
30 kg gold

More Telugu News