kuwaiat: కువైట్ లో కడప జిల్లాకు చెందిన వ్యక్తి దారుణ హత్య

  • రూమ్మేట్లే హత్య చేసి ఉంటారని భావిస్తున్న కువైట్ పోలీసులు
  • ఇద్దరు కేరళవాసులు అరెస్ట్
  • కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు
బతుకుదెరువు కోసం కువైట్ కు వెళ్లిన కడప జిల్లా వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇతడిని నందలూరు గ్రామస్తుడు సయ్యద్ పీర్ గా గుర్తించారు. సయ్యద్ తో పాటు రూములో ఉన్న వ్యక్తులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని కువైట్ పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి కువైట్ పోలీసులు ఇద్దరు కేరళ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సయ్యద్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హత్య వార్తను తెలుసుకున్న సయ్యద్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ సయ్యద్ భార్య ప్రభుత్వాన్ని కోరింది.
kuwaiat
kadapa man murdered in kuwait

More Telugu News