వైఎస్ జగన్: ఎల్లుండి తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక భేటీ
- వచ్చేనెల 2 నుంచి జగన్ పాదయాత్ర
- పాదయాత్ర కోసం చేయాల్సిన ఏర్పాట్లపై చర్చ
- మీడియాకు వివరించిన విజయసాయిరెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేనెల 2 నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 11న తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య నేతలతో సమావేశం కానున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో జగన్ పాదయాత్ర కోసం చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించనున్నారు.
ఈ సమావేశానికి హాజరుకావాలని తమ నేతలకు ఆహ్వానం పంపామని తెలిపారు. 2019లో గెలుపే లక్ష్యంగా ఇప్పటికే ఆ పార్టీ 'వైఎస్సార్ కుటుంబం'లో సభ్యులుగా చేరండంటూ ఓ కార్యక్రమం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. జగన్ చేయనున్న పాదయాత్రను ఆ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.