steve smith: ఉద్వేగభరిత సందేశాన్ని పోస్ట్ చేసిన స్టీవ్ స్మిత్

  • భారత పర్యటన చేదు జ్ఞాపకాలను మిగిల్చింది
  • టీ20ల్లోనైనా తమ అదృష్టం మారుతుందేమో
  • గాయం నన్ను ఎంతో బాధించింది
భారత్ తో జరుగుతున్న సిరీస్ మధ్యలోనే ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఓ ఉద్వేగభరిత సందేశాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం వరుస విజయాలతో భారత్ చాలా సంతోషంగా ఉందని... తమకు మాత్రం చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని స్మిత్ చెప్పాడు.

తమ వన్డే పర్యటన ప్రణాళికాబద్ధంగా కొనసాగలేదని అన్నాడు. వివిధ కారణాలకు తోడు దురదృష్టం కూడా తమను వెంటాడిందని చెప్పాడు. టీ20ల్లోనైనా తమ అదృష్టం మారుతుందేమో అని ఆశతో చూస్తున్నానని తెలిపాడు. గాయం కారణంగా ఆటకు దూరమవడం తనను ఎక్కువగా బాధించిందని అన్నాడు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటానని... ఆ తర్వాత ఆటగాళ్ల పునరావాస శిబిరంలో పొల్గొంటూ, గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు.
steve smith
australia cricket captain
t20

More Telugu News