actor harnatha rao: సినీ నటుడు, రచయిత ఎంవీఎస్ హరనాథరావు గుండెపోటుతో మృతి

  • ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి 
  • నటుడిగా, మాటల రచయితగా గుర్తింపు
  • 1948లో ప్రకాశం జిల్లాలో జననం
ప్రముఖ సినీ నటుడు, రచయిత, నిర్మాత ఎంవీఎస్ హరనాథరావు కన్నుమూశారు. ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు. 150కి పైగా సినిమాలకు ఆయన మాటల రచయితగా పని చేశారు. స్వయంకృషి, ప్రతిఘటన, సూత్రధారులు, భారతనారి, రాక్షసుడు వంటి సినిమాలు ఆయకు మాటల రచయితగా మంచి పేరును తెచ్చిపెట్టాయి. రాక్షసుడు, స్వయంకృషి వంటి పలు చిత్రాల్లో ఆయన నటించారు కూడా. ప్రతిఘటన, భారతనారి, అమ్మాయికాపురం, అన్న సినిమాలకు నంది అవార్డులు అందుకున్నారు. 1948 జులై 27న ఆయన ప్రకాశం జిల్లాలో జన్మించారు. 
actor harnatha rao
tollywood
harnatha rao died

More Telugu News