rajasekhar: డిప్రెషన్ లో యాక్సిడెంట్ చేసిన హీరో రాజశేఖర్... మద్యం తాగలేదన్న పోలీసులు!

  • రోడ్డుపై కారును అడ్డదిడ్డంగా నడుపుతూ యాక్సిడెంట్ చేసిన రాజశేఖర్
  • మద్యం తాగలేదని నిర్ధారించిన పోలీసులు
  • ఇటీవల తల్లి మరణించడంతో డిప్రెషన్ లో ఉన్న రాజశేఖర్
ప్రముఖ సినీనటుడు రాజశేఖర్ ను యాక్సిడెంట్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... హైదరాబాదులోని రాజేంద్రనగర్ రోడ్లపై అడ్డదిడ్డంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ రాంరెడ్డి అనే వ్యక్తి కారును రాజశేఖర్ ఢీ కొట్టారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజశేఖర్ మద్యంతాగి డ్రైవ్ చేస్తూ తన కారును ఢీ కొట్టాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే, తాను మద్యం తాగలేదని, కొంచెం ఒత్తిడిలో ఉన్నానని రాజశేఖర్ తెలిపారు. కావాలంటే టెస్టు చేసుకోవాలని ఆయన ముందుకొచ్చారు. దీంతో రాజేంద్రనగర్ పోలీసులు ఆయనకు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేశారు. ఇందులో ఆయన మద్యం తాగలేదని నిర్ధారణ అయింది. చివరికి బాధితుడు రాంరెడ్డి కూడా రాజీకి రావడంతో పోలీసులు సమస్యను పరిష్కరించి, రాజశేఖర్ ను వదిలేశారు. ఇంతలో ఆయన భార్య జీవిత వచ్చి, తన తల్లి ఇటీవల మరణించడంతో రాజశేఖర్ డిప్రెషన్ లో కూరుకుపోయారని, దీంతోనే యాక్సిడెంట్ జరిగి ఉంటుందని వివరణ ఇచ్చారు. 
rajasekhar
accident
rajendranagar police
depression

More Telugu News