జీహెచ్ఎంసీ: అప్పుడేమో ఆనందించేవాడిని.. ఇప్పుడేమో మేఘాన్ని చూస్తే భయమేస్తోంది!: జీహెచ్ఎంసీ కమిషనర్ చమత్కృతి

  • ఓ గృహిణి బాధ్యతలు ఎంత  కష్టమో..ఈ జాబ్ కూడా అంతే!
  • ఎంత చేసినా తిట్టించుకోవడానికి ఆస్కారం ఉన్న జాబ్
  • ఓ ఇంటర్వ్యూలో కమిషనర్ జనార్దన్ రెడ్డి

‘అనంతపురంలో పనిచేస్తున్నప్పుడు వర్షం పడితే రాత్రంతా వరండాలో కుర్చీ వేసుకుని కూర్చుని.. చూస్తూ ఆనందించేవాడిని..ఇప్పుడేమో మేఘాన్ని చూస్తే భయమేస్తోంది’ అంటూ చమత్కరించారు జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్ రెడ్డి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఇంతవరకూ నేను నిర్వహించిన అన్ని పదవుల్లోకి చాలా సంక్లిష్టమైంది, బాధపడేట్టుగా చేసేది మున్సిపల్ కమిషనర్ జాబ్. థ్యాంక్స్ లెస్ జాబ్. ఓ గృహిణి బాధ్యతలు ఎంత  కష్టమో.. ఈ జాబ్ కూడా అంతే! ఎంత చేసినా తిట్టించుకోవడానికి ఆస్కారం ఉన్న జాబ్. ఎక్కువ పనిచేస్తూ, ఎక్కువ తిట్లు పడుతూ, ఎక్కువ చెడు పేరు తెచ్చుకునే అవకాశం ఉన్న జాబ్!’ అని నవ్వుతూ ఆయన చెప్పుకొచ్చినా, అంతర్లీనంగా ఆయనలోని బాధ కనిపించింది.

More Telugu News