pawan kalyan: పవన్, త్రివిక్రమ్ కొత్త చిత్రం పేరు ఖరారు... రిజిస్టర్ చేయించిన హారికా అండ్ హాసినీ క్రియేషన్స్

  • ఫిలిం చాంబర్ లో 'ఆజ్ఞాతవాసి' టైటిల్ రిజిస్టర్
  • అదే పవన్ కొత్త సినిమా పేరంటున్న అభిమానులు
  • సోషల్ మీడియాలో పోస్టర్లు
  • జనవరి 10న విడుదలకు సిద్ధం!
పవన్ కల్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం టైటిల్ ఏంటన్న విషయమై పలు పేర్లు చక్కర్లు కొడుతున్న వేళ, చిత్రాన్ని నిర్మిస్తున్న హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ 'అజ్ఞాతవాసి' అన్న పేరును ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేయించింది. దీంతో ఇదే పవన్ కొత్త సినిమా పేరన్న భావనకు వచ్చిన అభిమానులు ఈ పేరుతో పోస్టర్లు తయారు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి 'ఇంజనీర్ బాబు', 'గోకుల కృష్ణుడు', 'దేవుడే దిగివచ్చినా', 'అజ్ఞాతవాసి' అంటూ పలు పేర్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'అజ్ఞాతవాసి' అన్న పేరును ఖరారు చేసినట్టు అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. దీపావళి నాటికి సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను బహిర్గతం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం సంక్రాంతి సీజన్ లో జనవరి 10న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
pawan kalyan
trivikram
agnatavasi

More Telugu News