Rakul: తిరుపతిలో హీరోయిన్ రకుల్‌ ప్రీత్ సింగ్ సందడి!

షార్ట్స్‌లో చూడండి
తిరుపతి నగరంలో సినీ న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్ సంద‌డి చేసింది. వీవీ మ‌హ‌ల్ రోడ్డులో శుభ‌మస్తు షాపింగ్ మాల్ ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన ఆమెను చూడ‌డానికి అభిమానులు ఎగ‌బ‌డ్డారు. శ్రీవారి పాదాల చెంత సంప్రదాయ వస్త్రాలయాన్ని ఏర్పాటు చేశార‌ని, శారీస్, టెక్స్‌టైల్స్, రెడీమేడ్స్, అన్ని రకాల వస్త్రాలు, వన్‌ గ్రాము జ్యుయలరీని ఈ షాపింగ్ మాల్‌లో అందుబాటులో ఉంచారని ర‌కుల్‌ చెప్పింది.

రకుల్ ఈ షోరూంను ప్రారంభించగా, ఏపీ మంత్రి ఎన్‌.అమరనాథరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సంద‌ర్భంగా అమరనాథరెడ్డి మాట్లాడుతూ.. ఈ షాపింగ్ మాల్‌లో అన్ని వర్గాల ప్రజలకు సరసమైన ధరలకే వస్త్రాలు అందిస్తున్నార‌ని చెప్పారు.  
Go Back to Shorts
Rakul

More Telugu News