ravindra jadeja: క్రికెటర్ జడేజా రెస్టారెంట్ లో కలుషిత ఆహారం.. తనిఖీలు

  • ఫ్రిజ్ లో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన పదార్థాలను గుర్తించిన అధికారులు
  • బేకరీ ఉత్పత్తులలో ఫంగస్
  • ముగింపు తేదీ ముద్రించని ఉత్పత్తులు
టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా రెస్టారెంట్ వార్తల్లోకి ఎక్కింది. తన సోదరితో కలసి జడేజా నిర్వహిస్తున్న 'జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్' రెస్టారెంట్ లో రాజ్ కోట్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రిజ్ లో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన పదార్థాలను గుర్తించారు.

 దీనికితోడు, బేకరీ ఉత్పత్తుల్లో ఫంగస్ ను గుర్తించారు. ఈ రెస్టారెంట్ లో పరిమితికి మించి ఫుడ్ కలర్స్, అజినోమోటో వినియోగిస్తున్నట్టు డిప్యూటీ హెల్త్ ఆఫీసర్ రాథోడ్ తెలిపారు. అంతేకాదు విక్రయానికి ఉంచిన ఉత్పత్తులపై ఎక్స్ పైరీ తేదీ కూడా లేదు. దీనికితోడు రెస్టారెంట్ లో పాడైపోయిన కూరగాయలను అధికారులు సీజ్ చేశారు.

ravindra jadeja
cricketer ravindra jadeja
jaddus food and field

More Telugu News