raviteja: ఇలాంటి సినిమా ఇంతవరకూ రాలేదు : రాజేంద్ర ప్రసాద్

  •  రవితేజ కథానాయకుడిగా 'రాజా ది గ్రేట్' 
  •  కీలకమైన పాత్రలో రాజేంద్ర ప్రసాద్
  •  దర్శకుడు నిజంగా గొప్పగా తీశాడు
  •  ఇన్నేళ్లలో ఇలాంటి సినిమా రాలేదు  
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'రాజా ది గ్రేట్' .. ఈ నెల 19వ తేదీన అత్యధిక థియేటర్స్ లో విడుదలవుతోంది. రవితేజ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, రాజేంద్రప్రసాద్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ సినిమాను గురించి ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాలోని అన్ని పాత్రలని దర్శకుడు మలచిన తీరు అద్భుతమని అన్నారు.

 చూపులేని కథానాయకులకి సంబంధించిన కథలతో చాలా సినిమాలు గతంలో వచ్చాయనీ, వాటికి ఇది పూర్తి భిన్నమైనదని చెప్పారు. హీరోను అంధుడిగా చూపిస్తూ ఇంత పెద్ద కమర్షియల్ సినిమా తీయడం నిజంగా సాహసమేనని అన్నారు. ఇండస్ట్రీలో 40 సంవత్సరాలుగా ఉంటోన్న తాను ఎన్నో సినిమాలు చూశాననీ, కానీ ఇలాంటి సినిమా తెలుగులోనే కాదు ఏ భాషలోను ఇంతవరకూ రాలేదని స్పష్టం చేశారు.  
raviteja
mehreen

More Telugu News