ntr: వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ విషయమై పార్టీ నిర్ణ‌యానికే క‌ట్టుబ‌డి ఉంటా: పురంధేశ్వ‌రి

  • పోటీ చేయ‌నున్న స్థానం గురించి స్ప‌ష్ట‌త‌నిచ్చిన బీజేపీ నేత‌
  • పార్టీ కేడ‌ర్ చెప్పిన‌ట్లుగా న‌డుచుకుంటాన‌ని వ్యాఖ్య‌
  • హిందూపురం నుంచి పోటీ చేస్తే హ‌రికృష్ణ‌తో విభేదాలు?
రాజ‌కీయంగా త‌న భ‌విష్య‌త్‌ కార్యాచ‌ర‌ణ గురించి బీజేపీ నేత పురంధేశ్వ‌రి ఓ ఇంటర్వ్యూలో స్ప‌ష్టం చేశారు. వచ్చే ఎన్నిక‌ల్లో హిందూపురం నుంచి పోటీ చేయ‌నున్నారంటూ వ‌స్తున్న పుకార్ల‌పై ఆమె వివ‌ర‌ణ ఇచ్చారు. తాను ప్ర‌త్యేకంగా హిందూపురం నుంచి పోటీ చేయాల‌ని తమ పార్టీ కేడ‌ర్ మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురావ‌డం లేద‌ని, పార్టీ ఏ స్థానం నుంచి పోటీ చేయమని నిర్ణ‌యిస్తే అక్క‌డి నుంచి పోటీ చేస్తాన‌ని ఆమె పేర్కొన్నారు.

రాష్ట్రంలో అన్ని స్థానాల నుంచి పార్టీ కేడ‌ర్ త‌న‌ను ఆహ్వానిస్తోంద‌ని, అయిన‌ప్ప‌టికీ ఇలాంటి పుకార్లు ఎలా పుడుతున్నాయో తెలియ‌డం లేదని ఆమె అన్నారు. ఎన్టీఆర్ రాయ‌ల‌సీమ‌కు ద‌త్త‌పుత్రుడి లాంటి వార‌ని ఆమె పేర్కొన్నారు. ఈ విష‌యంలో హరికృష్ణ‌తో విభేదాలు వ‌చ్చే అవ‌కాశం ఉందా? అనే ప్ర‌శ్న‌కు కుటుంబాన్ని, రాజ‌కీయాల‌ను తాను విడివిడిగా చూస్తాన‌ని ఆమె చెప్పారు.
ntr
laxmi's ntr
ram gopal varma
purndeswari
daggubati
interview
hindupuram
rajampeta
harikrishna

More Telugu News