kcr: సోనియాగాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్

  • తెలంగాణలో చావులకు సోనియానే కారణం
  • ఉన్న తెలంగాణను నెహ్రూ ఊడగొట్టారు
  • తెలంగాణ అడిగితే కాల్చి పారేయాలని ఇందిర అన్నారు
  • తెలంగాణ పాలిట కాంగ్రెస్ శనిలా దాపురించింది
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అనేక మంది చావులకు సోనియానే కారణమంటూ ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ తెలంగాణ బాగు కోసం పని చేయలేదని... అన్ని రకాలుగా తెలంగాణను ముంచిన పార్టీ అని ఆరోపించారు. తెలంగాణను నాశనం చేసింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు శనిలా పట్టిందని అన్నారు.

ఉన్న తెలంగాణను జవహర్ లాల్ నెహ్రూ ఊడగొట్టారని... తెలంగాణను అడిగితే కాల్చి వేయాలని ఇందిరాగాంధీ అన్నారని... తెలంగాణను ఇస్తామంటూ 14 ఏళ్లు ఏడిపించి, ఆలస్యం చేసి, అనేక మంది చావులకు సోనియాగాంధీ కాణమయ్యారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అసలు చరిత్ర ఇదేనని చెప్పారు. కాంగ్రెస్ కుటిల బుద్ధి తెలంగాణ ప్రజలకు తెలుసని... అందుకే ఆ పార్టీని తిరస్కరించారని అన్నారు. 
kcr
telangana cm
sonia gandhi
congress party
jawaharlal nehru
indhira gandhi
kcr fires on sonia gandhi

More Telugu News