జగన్: పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో.. సీబీఐ కోర్టులో జగన్‌ పిటిషన్!

  • వ‌చ్చేనెల 2 నుంచి పాదయాత్ర షురూ
  • 6 నెలల పాటు కోర్టులో హాజరు నుంచి మినహాయింపు కావాలి
  • రాష్ట్ర‌ ప్రతిపక్ష నేతగా ప్రజల‌ సమస్యలపై స్పందించాలి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌చ్చేనెల 2 నుంచి పాదయాత్ర చేపట్టనున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సీబీఐ కోర్టులో ఆయ‌న ఈ రోజు ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. త‌న‌కు వ‌చ్చేనెల 2 నుంచి 6 నెలల పాటు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని అందులో పేర్కొనారు.

అక్ర‌మాస్తుల కేసు విచారణ నేప‌థ్యంలో ప్రతి శుక్రవారం నాడు జ‌గ‌న్ కోర్టుకు హాజరుకావాలి. పాదయాత్ర నేప‌థ్యంలో కోర్టుకు హాజ‌రుకావ‌డం వీలుపడదని జ‌గ‌న్ పేర్కొన్నారు. రాష్ట్ర‌ ప్రతిపక్ష నేతగా ప్రజల‌ సమస్యలపై స్పందించాల్సిన బాధ్యత తనపై ఉందని, కాబట్టి కోర్టు హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. జ‌గ‌న్ వేసిన‌ ఈ పిటిషన్‌పై విచారణ ఈ నెల 13న‌ జరుగుతుంది.  
జగన్
అక్రమాస్తుల కేసు

More Telugu News