adi saikumar: 'నెక్స్ట్ నువ్వే' ఆడియో రిలీజ్ రేపే!

షార్ట్స్‌లో చూడండి
ఆది సాయికుమార్ హీరోగా .. బుల్లితెర ప్రభాకర్ దర్శకుడిగా మారి 'నెక్స్ట్ నువ్వే' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతాన్ని అందించాడు.

ఈ సినిమా ఆడియోను రేపు రిలీజ్ చేయనున్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో రేపు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఈ ఫంక్షన్ ప్రారంభం కానుంది. వి 4 మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో వైభవి కథానాయికగా నటించగా, ముఖ్యమైన పాత్రలో రష్మీ కనిపించనుంది. ఈ సినిమాను నవంబర్ 3వ తేదీన విడుదల చేయనున్నారు. దర్శకుడిగా పరిచయమవుతోన్న బుల్లితెర ప్రభాకర్ కి, ఈ సినిమా సక్సెస్ ను ఇస్తుందేమో చూడాలి.        
Go Back to Shorts
adi saikumar
vaibhavi

More Telugu News