dulkar salman: 'సోలో' చిత్రంలో దుల్కర్ సల్మాన్ అదరగొట్టాడట!

  •  దుల్కర్ సల్మాన్ తాజా చిత్రంగా 'సోలో'
  •  తమిళ .. మలయాళ భాషల్లో రిలీజ్ 
  •  దుల్కర్ నటనకు ప్రశంసలు       
మలయాళంలోని స్టార్ హీరోలలో ఒకరుగా దుల్కర్ సల్మాన్ కనిపిస్తాడు. మలయాళంతో పాటు తమిళంలోను ఆయనకి ఎంతో క్రేజ్ వుంది. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ఆయన తన క్రేజ్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజా చిత్రం 'సోలో' తమిళ .. మలయాళ భాషల్లో  ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 దుల్కర్ సల్మాన్ డిఫరెంట్ షేడ్స్ లో .. డిఫరెంట్ లుక్స్ తో అదరగొట్టేశాడని అంటున్నారు. ఆయన విలక్షణమైన నటన అందరినీ ఆకట్టుకుని తీరుతుందని చెబుతున్నారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ లో ఆయన సరసన కథానాయికలుగా నేహాశర్మ .. ధన్సిక .. శ్రుతి హరిహరన్ .. ఆర్తి వెంకటేశ్ నటించారు. బలమైన కథా కథనాలతో దర్శకుడు బిజోయ్ నంబియార్ ప్రేక్షకులను కట్టిపడేశారని చెప్పుకుంటున్నారు. దుల్కర్ ఖాతాలో మరో హిట్ చేరిపోయినట్టేనని ఆయన అభిమానులు అంటున్నారు.        
dulkar salman
neha sharma

More Telugu News