allu arjun: ఫ్యాన్స్ కు ఊటీలో లంచ్ అరేంజ్ చేసిన బన్నీ!

  • నాపేరు సూర్య, నా ఇల్లు ఇండియా షూటింగ్ లో బిజీగా అల్లు అర్జున్
  • ఊటీలో కీలక సన్నివేశాల చిత్రీకరణ
  • షూటింగ్ చూసేందుకు వచ్చిన అభిమానులకు లంచ్ అరేంజ్ చేసిన అల్లు అర్జున్
 వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. హీరో అల్లు అర్జున్, హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్, కీలక పాత్రధారి పోసాని కృష్ణమురళి మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ ప్రాంతానికి బన్నీ అభిమానులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారట. సాధారణంగా షూటింగ్ జరిగే ప్రదేశానికి ఎవరినీ అనుమతించరన్న సంగతి తెలిసిందే.

 షూట్ సందర్భంగా లుక్, సన్నివేశాలు బయటకి వెళ్లిపోతాయన్న ఉద్దేశంతో అలా చేస్తారు. అయితే కోలీవుడ్, మల్లూవుడ్ లో భారీగా అభిమానులను పోగేసుకున్న బన్నీ మాత్రం తన అభిమానులను షూటింగ్ చూడనిచ్చాడట. ఆ తరువాత వారికి లంచ్ కూడా ఏర్పాటు చేసినట్టు చిత్రయూనిట్ చెబుతోంది. ఈ అభిమానులు తెలుగు రాష్ట్రాల వారు కాదని, కోలీవుడ్, మల్లూవుడ్ కి చెందిన అభిమానులని సమాచారం. దీంతో బన్నీ అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోయిందని తెలుస్తోంది. 
allu arjun
anu immanuel
naa peru surya-naa illu india
movie
fan's

More Telugu News