chintakayala aiyannapatrudu: కోర్టుకు హాజరైన ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు

  • ఎలమంచిలి కోర్టులో అయ్యన్న
  • 2012 పాయకరావు పేట ఎన్నికల కేసు
  • అప్పట్లో కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన అయ్యన్న
  • కాంగ్రెస్ పెట్టించిన తప్పుడు కేసని ఆరోపణ
ఆంధ్రప్రదేశ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ ఉదయం ఎలమంచిలి కోర్టుకు హాజరయ్యారు. 2012లో పాయకరావుపేట ఉప ఎన్నిక జరుగగా, ఆ సమయంలో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్టు అయ్యన్నపాత్రుడిపై కేసు దాఖలైంది. కోర్టు విచారణకు ఆయన సక్రమంగా హాజరు కాకపోవడంతో ఇటీవల నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ అయ్యాయి.

 ఈ నేపథ్యంలో కోర్టుకు వచ్చిన ఆయన, న్యాయమూర్తి ఎదుట హాజరై, తనపై ఉన్న ఎన్బీడబ్ల్యూను రీకాల్ చేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తనపై పెట్టిన తప్పుడు కేసు ఇదని ఆరోపించారు. న్యాయస్థానాలపై తనకు నమ్మకం ఉందని చెప్పారు.
chintakayala aiyannapatrudu
AP minister
payakarao peta
court

More Telugu News