nagarjuna: 'కోడలి కోసం ఎదురు చూస్తున్నాం' అంటూ ఫ్యామిలీ ఫొటో పోస్టు చేసిన నాగార్జున

  • కోడలి కోసం ఎదురు చూస్తున్నాం...ఈ సాయంత్రం తను వచ్చి చేరుతుందంటూ ట్వీట్
  • అక్కినేని అభిమానులను ఆకట్టుకుంటున్న ఫ్యామిలీ ఫొటో
  • ఇంతకు ముందే చైతన్య, వెంకటేష్ తో దిగిన ఫొటో పోస్టు చేసిన నాగార్జున
టాలీవుడ్ యువ జంట నాగచైతన్య, సమంతల వివాహం గోవాలోని వెగాటర్ బీచ్ లోని డబ్ల్యూ హోటల్ లో మరికాసేపట్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గోవా చేరుకున్న కుటుంబ సభ్యులు, సన్నిహితులు సంప్రదాయ రీతిలో వివాహ వేడుక నిర్వహించే బాధ్యతల్లో మునిగిపోయారు. ఈ ఉదయం నాగచైతన్యను పెండ్లి కొడుకుని చేశారు.

ఈ ఉదయం మేనమామ వెంకటేష్, తండ్రి నాగార్జునతో కలసి చైతూ దిగిన ఫోటోను నాగార్జున తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తమ కుటుంబంతో కలసి దిగిన మరో ఫొటోను పోస్టు చేస్తూ, 'కోడలి కోసం ఎదురు చూస్తున్నాం... ఈ సాయంత్రం తను వచ్చి మా కుటుంబంతో కలుస్తుంది' అని కామెంట్ పెట్టారు. ఈ ఫొటో అక్కినేని అభిమానులను ఆకట్టుకుంటోంది.
nagarjuna
chitanya
samantha
marriage
nagarjuna
family

More Telugu News