dhoni: ధోనీని అనుక‌రించిన కుక్క‌... వీడియో పోస్ట్ చేసిన భార్య సాక్షి

షార్ట్స్‌లో చూడండి
 క్రికెట‌ర్ ఎంఎస్ ధోనీ ఎంత కూల్‌గా ఉంటాడో ఈ వీడియో చూస్తే మ‌రోసారి అర్థ‌మవుతుంది. త‌న‌కు పెంపుడు జంతువులంటే చాలా ఇష్ట‌మ‌ని ఆయ‌న చెప్పిన మాట‌ను మ‌రోసారి రుజువు చేసుకున్నాడు. త‌మ పెంపుడు కుక్క `శామ్‌`తో ధోనీ ఆడుతున్న వీడియోను ఆయ‌న భార్య సాక్షి త‌న ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది.

`బెల్జియ‌న్ మాలినోయిస్ జాతికి చెందిన శామ్ కు అనుక‌రించే టాలెంట్ వుంది` అని సాక్షి పోస్ట్ రాసింది. ఆమె చెప్పిన‌ట్లుగానే ఈ వీడియోలో ధోనీని శామ్ అనుక‌రించ‌డం చూడొచ్చు. ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్ విజ‌యం త‌ర్వాత ఇంట్లో సేద‌దీరుతున్న ధోనీ ఇటీవ‌ల త‌మ ఇంటికి బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్‌ను ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే.
Go Back to Shorts
dhoni
saskhi
dog
belgian malinois
imitating
mirroring

More Telugu News