naga chitanya: సమంతకు, చైతూకు చెప్పకుండా సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన నాగ్, వెంకీ, రానా, అఖిల్!

షార్ట్స్‌లో చూడండి
నేడు గోవాలో నిరాడంబరంగా నాగ చైతన్య, సమంతల వివాహం జరుగనుండగా, అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం కలసి సమంతకు వెల్ కమ్ చెబుతూ ఓ చిన్న వీడియోలో యాక్ట్ చేశారు. వివాహం జరుగుతున్నప్పుడు ప్రదర్శించేందుకు ఈ వీడియోను రూపొందించారని, దీని గురించి సమంత, చైతూలకు తెలియదని సమాచారం. సమంతకు సర్ ప్రైజ్ గా ఈ వీడియోను కానుకగా ఇవ్వాలని భావించిన రెండు ఫ్యామిలీలూ ఆమెకు స్వాగతం చెబుతూ కనిపిస్తాయట.

నాగార్జున, అమల, అఖిల్ తో పాటు వెంకటేష్, రానా, సుమంత్ తదితరులంతా ఈ వీడియోలో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ వీడియో సమంతకు స్వీట్ షాకింగ్ గా ఉంటుందన్న నమ్మకంతో వీరంతా ఉన్నారట. కాగా, వీరిద్దరి వివాహం నేటి రాత్రి గోవాలో జరగనుండగా, ఫ్యాన్స్ చైతూ జంటకు శుభాభినందనలు చెబుతూ కామెంట్ల వరద పారిస్తున్నారు. ఎక్కువ మంది అభిమానులు, ఈ జంట తొలి చిత్రం 'ఏమాయ చేశావే' దర్శకుడు గౌతమ్ మీనన్ ను ప్రస్తావిస్తుండటం విశేషం. వీరిద్దరి ప్రేమకు బీజం వేసింది గౌతమేనని, ఆయన ఫోటోను పూజ గదిలో పెట్టుకుని జీవితాంతం పూజించుకోవాలని సలహాలు కూడా ఇస్తున్నారు.
Go Back to Shorts
naga chitanya
samantha
nagarjuna
venkatesh

More Telugu News