laxmi manchu: ఏమిటీ ట్రాఫిక్?... రాజకీయ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంచు లక్ష్మి!

  • హైటెక్స్ సమీపంలో ట్రాఫిక్ లో చిక్కుకున్న మంచు వారమ్మాయి 
  • గంటన్నరపాటు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన వైనం 
  • ట్విట్టర్ లో రాజకీయ నాయకులపై ఆగ్రహం
హైదరాబాదు రోడ్లపై ప్రయాణం రోజురోజుకీ కష్టసాధ్యమవుతోంది. మెట్రో పనులతో రోడ్డు బ్లాకులు, మళ్లించిన రోడ్లలో గతుకులు, ఎప్పటికప్పుడు పలకరించే ట్రాఫిక్ సమస్యలు హైదరాబాదీలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. తాజాగా ఈ ఇబ్బందుల బారిన సినీ నటి మంచు లక్ష్మి కూడా పడింది.

హైటెక్స్ ఏరియాలో గంటన్నర పాటు ట్రాఫిక్‌ లో చిక్కుకున్న మంచు లక్ష్మి రాజకీయ నాయకులపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆమె 'గంటన్నర పాటు హైటెక్స్‌ ఏరియాలో ట్రాఫిక్ కారణంగా చిక్కుకున్నాను. రాజకీయ నాయకులు మాలాగ సాధారణ పౌరులుగా ఎలాంటి ప్రొటోకాల్ లేకుండా నగర రోడ్లపై ప్రయాణం చేస్తే ఏం జరుగుతుందో అర్థమవుతుంది' అంటూ ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్ కు అభిమానులు, హైదరాబాదీలు మద్దతు తెలుపుతున్నారు. 
laxmi manchu
Hyderabad
hi-tex
traffic
twitter

More Telugu News