హేమమాలిని: బాలీవుడ్ నటి హేమమాలినికి చెందిన గోడౌన్ లో చోరీ!

  • ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన
  • పశ్చిమ అంధేరిలోని గోడౌన్ లో సంఘటన
  • షూటింగ్ ల్లో ఉపయోగించే కాస్ట్యూమ్స్, ఆభరణాలు తదితర వస్తువులను దోచుకెళ్లిన వైనం 
బీజేపీ ఎంపీ, బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలినికి సంబంధించిన ఓ గోడౌన్ లో దొంగలు పడి దోచుకెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ముంబైలోని పశ్చిమ అంధేరిలోని డీఎన్ నగర్ లో హేమమాలినికి సంబంధించిన ఓ గోడౌన్ ఉంది. ఆ గోడౌన్ లో షూటింగుల్లో ఉపయోగించే వస్తువులు, ఆభరణాలు, కాస్ట్యూమ్స్ మొదలైన వాటిని భద్రపరచుకుంటారు. ఆరు రోజుల క్రితం దొంగలు పడి వీటన్నింటిని ఎత్తుకుపోయారు.

ఈ మేరకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోడౌన్ కు కాపలా కాసే వ్యక్తి కనిపించకుండా పోవడంతో, అతనిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దోచుకెళ్లిన సొత్తు విలువ రూ.90 వేల వరకు ఉంటుందని సమాచారం.
హేమమాలిని
గోడౌన్

More Telugu News