భద్రాద్రి రామయ్య పూజకు పూలు కరువు.. మూడు రోజులుగా మూర దండ కూడా లేకుండానే అర్చనలు!
- చర్చనీయాంశంగా మారిన పుష్పాల కొరత
- పూల కాంట్రాక్టర్‌దే తప్పంటున్న అధికారులు
- మండిపడుతున్న భక్తులు
పూలు లేకుండా పూజలు నిర్వహిస్తుండడంపై భక్తులు మండిపడుతున్నారు. భద్రాద్రి ఆలయానికి ఏడాదికి రూ.30 కోట్ల వరకు ఆదాయం వస్తున్నా పుష్పాలు సైతం కొనలేని దుస్థితిలో అధికారులు ఉన్నారా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే దేవస్థానం కాంట్రాక్టరు మూడు రోజులుగా పూలు సరఫరా చేయకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా మూడు రోజులుగా స్వామి వారికి పుష్పాలంకరణ లేకుండానే ఆలయ అర్చకులు పూజలు ముగించేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.