‘సాక్షి’ : ‘సాక్షి’ తప్పుడు కథనాల వల్లే కృష్ణాబోర్డుకు మంత్రి హరీశ్ రావు ఫిర్యాదు చేశారు: టీడీపీ నేత సీఎం రమేష్
- రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ అడ్డుపడుతోంది
- ‘ఉపాధి హామీ’ పనులపై వైసీపీ నేతల ఫిర్యాదుతో నిధులు ఆగిపోయాయి
- మీడియాతో సీఎం రమేష్
ఏపీలో నీటిని అక్రమంగా వాడుకుంటున్నారంటూ ‘సాక్షి’లో వెలువడ్డ తప్పుడు కథనాల వల్లే కృష్ణా బోర్డుకు తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఫిర్యాదు చేశారని టీడీపీ నేత సీఎం రమేష్ ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ అడ్డుపడుతోందని, ఉపాధి హామీ పనుల్లో పొక్లయినర్లు వాడుతున్నారని ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేయడం వల్లే నిధులు ఆగిపోయాయని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న వైఎస్సార్సీపీ తీరును ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.