chemistry: ర‌సాయ‌నశాస్త్రంలో 2017 నోబెల్ విజేత‌లు వీరే!

  • స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన జాకెస్ డుబోషెట్‌
  • అమెరికాకు చెందిన జోషిమ్ ఫ్రాంక్‌
  • యూకేకు చెందిన రిచ‌ర్డ్ హెండ‌ర్స‌న్‌
  • జీవాణువులపై ప‌రిశోధించిన ముగ్గురు శాస్త్ర‌వేత్త‌లు
2017 సంవ‌త్స‌రానికి గాను ర‌సాయ‌నశాస్త్ర విభాగంలో నోబెల్ గెల్చుకున్న శాస్త్ర‌వేత్త‌ల వివ‌రాల‌ను స్టాక్‌హోంలోని రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ ప్ర‌క‌టించింది. సంక్లిష్ట ఆకృతులు గ‌ల జీవాణువుల నిర్మాణానికి సంబంధించిన హై రెజ‌ల్యూష‌న్ చిత్రాలు రూపొందించినందుకు స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన జాకెస్ డుబోషెట్‌, అమెరికాకు చెందిన జోషిమ్ ఫ్రాంక్‌, యూకేకు చెందిన రిచ‌ర్డ్ హెండ‌ర్స‌న్‌ల‌కు నోబెల్ అంద‌జేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

వీరు ముగ్గురికి 9 మిలియ‌న్ల స్వీడ‌న్ క్రోన్ల‌ను బ‌హుమ‌తిగా ఇవ్వ‌నున్నారు. వీరు అభివృద్ధి చేసిన క్ర‌యో ఎల‌క్ట్రానిక్ మైక్రోస్కోపి విధానం వ‌ల్ల జీవాణువుల సంక్లిష్ట నిర్మాణాల‌ను సుల‌భంగా అధ్య‌య‌నం చేసే వీలు క‌లిగింది. బ‌యోకెమిస్ట్రీ రంగ అభివృద్ధిలో వీరి ప‌రిశోధ‌న ఒక మైలురాయిలా నిలిచింది.
chemistry
nobel
royal swedish academy
Jacques Dubochet
Joachim Frank
Richard Henderson

More Telugu News