‘బిగ్ బాస్’ సీజన్ - 2: ‘బిగ్ బాస్’ సీజన్ - 2 హోస్ట్ జూనియర్ ఎన్టీఆరే!

  • 'బిగ్ బాస్'తో ఆకట్టుకున్న ఎన్టీఆర్ 
  • ఓ న్యూస్ ఛానెల్ కు జూనియర్ ఎన్టీఆర్ చెప్పారట
  • తారక్ అభిమానులకు ఇది శుభవార్తే!
‘బిగ్ బాస్’ సీజన్ - 1 ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా బాగా చేశాడంటూ ప్రశంసలు లభించడం విదితమే. అయితే, ‘బిగ్ బాస్’ సీజన్ - 2కు వ్యాఖ్యాత ఎవరనే విషయమై అభిమానులు, ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఎంతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ సీజన్ - 2కు హోస్ట్ గా వ్యవహరించడని, తప్పుకుంటాడనే వార్తలు సామాజిక మాధ్యమాల వేదికగా హల్ చల్ చేశాయి.

అయితే, సీజన్ -2కు కూడా జూనియర్ ఎన్టీఆరే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడని తెలిసింది. ఈ మేరకు ఓ న్యూస్ ఛానెల్ జూనియర్ ఎన్టీఆర్ ని సంప్రదించగా తానే వ్యాఖ్యాతగా కొనసాగనున్నట్టు ఆయన ధ్రువీకరించారట. దీంతో, ‘బిగ్ బాస్’ అభిమానులకు, ముఖ్యంగా, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇది శుభవార్త అనే చెప్పొచ్చు. 
‘బిగ్ బాస్’ సీజన్ - 2
జూనియర్ ఎన్టీఆర్
వ్యాఖ్యాత

More Telugu News