prabhas: అనుష్కతో ప్రభాస్ ఎంగేజ్ మెంట్ వార్తలను ఖండించిన ఆయన ప్రతినిధులు

  • ఎంగేజ్ మెంట్ వార్తల్లో నిజం లేదు
  • అలాంటిదేమైనా ఉంటే వారు ఎప్పుడో చెప్పేవారు
  • సంబంధం లేని వ్యక్తుల ప్రచారాన్ని నమ్మకండి
సినీ హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కలు ప్రేమలో ఉన్నారని, డిసెంబర్ లో వారిద్దరి ఎంగేజ్ మెంట్ జరగబోతోందంటూ ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు నిన్న ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్త క్షణాల్లో వైరల్ అయిపోయింది. వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారే తుది నిర్ణయానికి అందరూ వచ్చేశారు.

అయితే, ఈ వార్తలను ప్రభాస్ తరపున అతని ప్రతినిధులు ఖండించారు. నిజంగా ప్రభాస్, అనుష్కల మధ్య ఇలాంటి అనుబంధం ఉంటే... ఈ విషయాన్ని వారు ఎప్పుడో ప్రకటించేవారని వారు తెలిపారు. సంబంధం లేనివారు సోషల్ మీడియాలో ఏదో చెబితే, దాన్ని నమ్మాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎంగేజ్ మెంట్ కు సంబంధించి జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు. 
prabhas
anushka
prabhas anushka engagement

More Telugu News