jio: హైదరాబాదులో అడుగుపెట్టిన జియో ఫోన్లు.. డెలివరీ ప్రారంభం!

షార్ట్స్‌లో చూడండి
జియో ఫీచర్ ఫోన్లను బుక్ చేసుకుని, వాటి కోసం ఎదురు చూస్తున్న హైదరాబాద్ వినియోగదారులకు శుభవార్త. ఈ ఫోన్లు హైదరాబాదులో అడుగుపెట్టాయి. మరి కొన్ని గంటల్లో వినియోగదారులకు అందనున్నాయి. హైదరాబాదులోని కవాడిగూడలో ఇప్పటికే ఈ ఫోన్లు డెలివరీ అయ్యాయని కూడా రిటైలర్లు చెబుతున్నారు. ప్రీబుకింగ్ సమయంలో రూ. 500 చెల్లించిన వినియోగదారులు... ఇప్పుడు మిగిలిన రూ. 1000 కూడా చెల్లించి, ఫోన్లను పొందవచ్చని వారు చెప్పారు.

 ఈ సాయంత్రం నుంచి ఫోన్ల డెలివరీ పూర్తి స్థాయిలో మొదలవుతుందని, రెండు రోజుల్లో ప్రీబుకింగ్ చేసుకున్నవారందరికీ అందుతాయని తెలిపారు. జియో ఫోన్లను తొలుత గ్రామీణ ప్రాంతాల్లో డెలివరీ చేశారు. నవరాత్రుల సందర్భంగా పల్లె ప్రజలకు ముందుగా ఫోన్లను అందించాలనే ఉద్దేశంతోనే, పల్లెల్లో ఫోన్లను డెలివరీ చేశామని జియో ప్రతినిధులు ఇదివరకే తెలిపారు. 
Go Back to Shorts
jio
jio phones
jio phones in hyderabad

More Telugu News