rajamouli: రాజమౌళి నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది తేలేది అప్పుడే!

  •  జనవరి నుంచి నెక్స్ట్ మూవీ పనుల్లో రాజమౌళి
  •  చరణ్ తో గానీ .. ఎన్టీఆర్ తో గాని వుండే అవకాశం
  •  నిర్మాతగా డీవీవీ దానయ్య  
రాజమౌళి తదుపరి సినిమా ఏమిటి? .. ఎవరితో ఉండనుంది? అనే ప్రశ్నలే ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే కథను బట్టి హీరోలను ఎంచుకునే రాజమౌళి మాత్రం ఈ విషయంపై ఇంతవరకూ మాట్లాడలేదు. రాజమౌళి ఏ హీరోతో సినిమా చేసినా దానికి నిర్మాత డీవీవీ దానయ్యనే.

 డీవీవీ దానయ్యకు చరణ్ ఓ సినిమా చేసి పెట్టవలసి వుంది. ఇక ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలనే ఆసక్తి కూడా దానయ్యకు చాలాకాలంగా వుంది. బన్నీతోనూ ఆయనకు మంచి సాన్నిహిత్యం వుంది. ఈ ముగ్గురిలో చరణ్ తో గానీ .. ఎన్టీఆర్ తో గాని రాజమౌళి నెక్స్ట్ మూవీ ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక రాజమౌళి అండ్ టీమ్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన పనులపై జనవరి నుంచి దృష్టి పెడతారట. అందువలన హీరో ఎవరనేది అప్పుడు తెలిసే ఛాన్స్ ఉందని అంటున్నారు.   
rajamouli

More Telugu News