samantha: చైతన్య ఆ సినిమా చూడనంటున్నాడు!: నాగార్జున

  • సమంతను దెయ్యంగా చైతూ ఎలా చూస్తాడో
  • సినిమానే చూడనన్నాడు
  • క్లైమాక్స్ లో నా పర్ఫామెన్స్ అదిరిపోతుంది
తన కోడలు సమంతను తానే దెయ్యంగా చూడలేకపోతున్నానని... తన కుమారుడు నాగచైతన్య ఎలా చూస్తాడోనంటూ నాగార్జున నవ్వుతూ అన్నారు. ఇద్దరూ ఒకే గదిలో ఎలా పడుకుంటారో అని చెప్పారు. సమంతను దెయ్యంగా చూడాల్సి వస్తుందనే కారణంతో, 'రాజుగారి గది-2' సినిమానే చూడనన్నాడని తెలిపారు.

తన భార్య అమల దెయ్యంలాంటిది కాదని... వెరీ బ్యూటీఫుల్ అని కితాబిచ్చారు. ఈ సినిమాలో సమంత చాలా బాగా నటించిందని... సినిమాలో అక్కడక్కడ కనిపిస్తుందని చెప్పారు. చివరి 20 నిమిషాలు మాత్రం తన పర్ఫామెన్స్ అదిరిపోతుందని తెలిపారు. ఈ సినిమా హిట్ అయితే, సీక్వెల్ చేసే అవకాశం ఉందని చెప్పారు.

samantha
nagarjuna
naga chaitanya
raju gaari gadi
amala

More Telugu News