‘మహానుభావుడు’: ఓ ‘మహానుభావుడు’ ఎటువంటి యాప్స్ లేని ఓ ఫోన్ వాడతాడు: సంగీత దర్శకుడు థమన్

  • శర్వానంద్ పై ట్విట్టర్ ఖాతాలో థమన్ పోస్ట్
  • సాధారణ నోకియా ఫోన్ వాడుతున్న శర్వా 
  • ఆ ఫోన్ వాడుతూ సోషల్ యాక్టివిటీస్ కు దూరం 

ప్రస్తుత డిజిటల్ యుగంలో యువత నుంచి సీనియర్ సిటిజన్ల వరకు అందరూ స్మార్ట్ ఫోన్ వాడుతూ టెక్నాలజీకి అప్ డేట్ అవుతున్న సమయం ఇది! అలాంటి సమయంలో చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరైనా కనబడితే  కొంత ఆశ్చర్యం కలగకమానదు. ముఖ్యంగా, సెలెబ్రిటీ స్టేటస్ కల్గిన వాళ్లు, మరీ ముఖ్యంగా, సినీ తారలు స్మార్ట్ ఫోన్ కు బదులు సాధారణ ఫోన్ తో కనిపిస్తే మరింత ఆశ్చర్యమే!

సినీ నటుడు శర్వానంద్ తన అభిమానులను ఆ ఆశ్చర్యానికే గురిచేస్తున్నాడు. ఎందుకంటే, శర్వానంద్ ఉపయోగించే ఫోన్ అత్యంత సాధారణమైన నోకియా ఫోన్. ఈ ఫోన్ లో ఎటువంటి యాప్స్ ఉండవు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు థమన్ ఓ ట్వీట్ ద్వారా బయటపెట్టాడు.

‘వాస్తవానికి, ఓ ‘మహానుభావుడు’ ఎటువంటి యాప్స్ లేని ఓ నోకియా ఫోన్ ను వాడుతూ సోషల్ యాక్టివిటీస్ తో సంబంధాలు లేకుండా ఉన్నాడు’ అంటూ పేర్కొన్న థమన్, నోకియా ఫోన్ చేతిలో పట్టుకుని ఫొటోకు పోజిస్తున్నశర్వానంద్ ఫొటోను పోస్ట్ చేశాడు.

  • Loading...

More Telugu News