celina jaitley: సెలీనా జైట్లీ ఇంట మ‌రో విషాదం... ఇటీవ‌ల జ‌న్మించిన క‌వ‌లల్లో ఒక‌రు మృతి

  • కార‌ణం - హృద‌య సంబంధ స‌మ‌స్య‌
  • రెండు నెల‌ల క్రిత‌మే తండ్రిని కోల్పోయిన న‌టి
  • ఫేస్‌బుక్‌లో వెల్ల‌డించిన సెలీనా
రెండు నెల‌ల క్రితమే తండ్రి క‌ల్న‌ల్ విక్ర‌మ్ కుమార్ జైట్లీ మ‌ర‌ణంతో కుంగిపోయిన బాలీవుడ్ న‌టి సెలీనా జైట్లీ ఇంట మ‌రో విషాదం చోటు చేసుకుంది. ఇటీవ‌ల రెండో కాన్పులో తాను జ‌న్మ‌నిచ్చిన క‌వ‌ల‌ల్లో ఒక‌రు చ‌నిపోయారు. తీవ్ర హృద‌య సంబంధ స‌మ‌స్య కార‌ణంగా త‌న బాబు చ‌నిపోయాడ‌ని సెలీనా ఫేస్‌బుక్ ద్వారా వెల్ల‌డించింది. ఈ విష‌యంపై ఆమె తీవ్ర ఆవేద‌న‌కు గురైంది. సెప్టెంబ‌ర్ 10న ఆమె క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. మొదటి కాన్పులోనూ సెలీనాకు కవలలే పుట్టారు. ప్ర‌స్తుతం ఐదేళ్ల వ‌య‌సున్న వీరిద్ద‌రి పేర్లు విన్‌స్టన్‌, విరాజ్‌.
celina jaitley
vikram kumar jaitley
vinstan
viraj
twins

More Telugu News