ramdas athawale: ఆర్మీలో చేరి రమ్ముతాగండి.. బాగా తినండి!: కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

  • దళితులకు సైన్యంలో రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్నాం
  • దళిత యువకులు స్థానికంగా దొరికే చౌకబారు మద్యం తాగుతున్నారు
  • దేశసేవలో చేరితే రమ్ము, మంచి భోజనం లభిస్తాయి 
  • రాందాస్ అథవాలే వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు

దళితులు దేశరక్షణలో పాలుపంచుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రి రాందాస్ అధవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్మీ, నౌక, వైమానిక దళాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని మనం డిమాండ్‌ చేస్తున్నామని ఆయన గుర్తుచేశారు. దేశంకోసం ఎటువంటి త్యాగానికైనా దళిత యువకులు ముందుంటారు కనుకే రిజర్వేషన్ కు డిమాండ్ చేస్తున్నామని ఆయన చెప్పారు.

దళితులు చౌకబారు మద్యానికి బానిసలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలా కాకుండా ఆర్మీలో చేరితో రమ్ము, మంచి భోజనం అందుబాటులో ఉంటాయని సూచించారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, దళితులంతా వ్యసనపరులు అనేలా ఉన్నాయని సోషల్ మీడియాలో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

  • Loading...

More Telugu News