tvv dinakaran: దినకరన్‌తో పాటు ఆయన అనుచరులపై మరో కేసు నమోదు.. మాజీ ఎమ్మెల్యే అరెస్టు

  • పళనిస్వామితో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర పదజాలంతో దూషిస్తూ కరపత్రాలు
  • దినకరన్ తో పాటు 15 మందిపై దేశ ద్రోహం కేసు నమోదు
తమ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామితో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర పదజాలంతో దూషిస్తూ ఉన్న కరపత్రాలను పంచి శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే ఆయ‌న మీద ప‌లు కేసులు ఉన్న విష‌యం తెలిసిందే. ఈ సారి ఆయ‌న‌పై దేశ ద్రోహం కేసు న‌మోదైంది. నిన్న ప‌ళ‌ని స్వామి త‌మ అధికారుల‌తో కీల‌క స‌మావేశం నిర్వ‌హిస్తుండ‌గా, మ‌రోవైపు దిన‌క‌ర‌న్‌ త‌న మ‌ద్ద‌తుదారుల‌తో క‌లిసి ఆ కరపత్రాలను పంచారు.

ఈ కేసులో ఆయ‌న‌తో పాటు మరో 15 మంది అతడి అనుచరులపై దేశద్రోహం కేసు నమోదైంది. ఇ‌ప్ప‌టికే దేశ ద్రోహం కేసులో మాజీ ఎమ్మెల్యే వెంకటాచలాన్ని అదుపులోకి తీసుకున్నారు. సమావేశ మందిరం బయట కరపత్రాలను పంచిపెట్టారని దిన‌క‌రన్ వ‌ర్గంపై వినాయకం అనే వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయ‌గా పోలీసులు ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.    
tvv dinakaran

More Telugu News