కేసీఆర్: హరీశ్వర్ రెడ్డి భూ కబ్జాలను కేసీఆర్ పట్టించుకోరే?: కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
- టీఆర్ఎప్ నేత హరీశ్వర్ రెడ్డిపై మండిపడ్డ కాంగ్రెస్ నాయకుడు
- సోమలింగేశ్వర ఆలయ భూములను కబ్జా చేశారని ఆరోపణ
భూ కబ్జాలకు పాల్పడుతున్న సొంత పార్టీ నేతలపై సీఎం కేసీఆర్ దృష్టిసారించడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. 22 ఎకరాల సోమలింగేశ్వర ఆలయ భూములను టీఆర్ఎస్ నేత, పరిగి మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి కబ్జా చేశారని ఆరోపించారు. తన కుమారుడు అనిల్ రెడ్డి పేరిట ఆ భూములను రిజిస్టర్ చేయించుకున్నారని, దేవాదాయ శాఖ కేసు పెట్టినా ఆయన పట్టించుకోలేదని, ఆ భూముల్లో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భూ రికార్డులు ప్రక్షాళన చేస్తామని చెబుతున్న కేసీఆర్, తన సొంత పార్టీ నేతలే భూ కబ్జాలకు పాల్పడుతుంటే చర్యలు తీసుకోవడం లేదని రామ్మోహన్ రెడ్డి విమర్శించారు.