nikhil: లాస్ వెగాస్ కాల్పులపై హీరో నిఖిల్ ట్వీట్

  • అమాయకులపై కాల్పులు దారుణం
  • ఉన్మాదులను కఠినంగా శిక్షించాలి
  • లాస్ వెగాస్ కోసం ప్రార్థిస్తున్నా
అమెరికాలోని లాస్ వెగాస్ లో ఉన్న ఓ సంగీత విభావరిలో కాల్పులు చోటుకున్న సంగతి తెలిసిందే. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 20 మందికి పైగా మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై టాలీవుడ్ హీరో నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశాడు.

"ఓ మై గాడ్. ఎప్పుడూ సంతోషంగా ఉండే నగరంలో ఇలా జరగడం భావ్యం కాదు. అమాయక ప్రజలపై ఉన్మాదంతో కాల్పులకు తెగబడుతున్న రాక్షసులను అడ్డుకుని, వారిని కఠినంగా శిక్షించాలి. వందలాది రౌండ్ల తూటాలు పేలాయి. సంగీత విభావరికి వెళ్లినవారు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం భయం గుప్పిట్లో బతుకుతోంది. మన నగరాల్లో ఇలాంటివి జరగకూడదు. చాలా బాధాకరం. లాస్ వెగాస్ లో ఉన్న అందరికోసం ప్రార్థిస్తున్నా" అంటూ ట్వీట్ చేశాడు. 
nikhil
tollywood
losvegas
losvegas firing

More Telugu News