prakash raj: స్పందిస్తారా? అవార్డును వెనక్కు ఇచ్చేయమంటారా?: నరేంద్ర మోదీకి ప్రకాష్ రాజ్ ప్రశ్న

  • గౌరీ లంకేష్ హత్యపై స్పందించండి
  • నరేంద్ర మోదీని డిమాండ్ చేసిన ప్రకాష్ రాజ్
  • లేకుంటే జాతీయ అవార్డును తిరిగిచ్చేస్తా
కర్ణాటకలో దారుణంగా హత్యకు గురైన సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యపై ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్పందించాలని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ డిమాండ్ చేశారు. మోదీ ఈ హత్యపై స్పందించకుంటే, తనకు ప్రభుత్వం ఇచ్చిన జాతీయ అవార్డులను వెనక్కు ఇచ్చేస్తానని అన్నారు.

కాగా, ప్రకాష్ రాజ్ గతంలోనూ గౌరీ లంకేష్ హత్యపై స్పందించిన సంగతి తెలిసిందే. హత్యపై వెంటనే నిందితులను అరెస్ట్ చేసి చట్టం ముందు నిలపకుంటే తాను నిరసనకు దిగుతానని ఆయన కన్నడ సర్కారును హెచ్చరించారు. గత నెలలో తన ఇంటిముందే గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో గౌరి హత్యకు గురికాగా, ఇంతవరకూ హంతకులు ఎవరన్న విషయం విచారిస్తున్న అధికారులకు అంతుబట్టలేదు.
prakash raj
gouri lankesh
narendra modi

More Telugu News