pawan kalyan: మనబలం అంతేనా అని అభిమానుల ఒత్తిడి... '175 సీట్లలో పోటీ' ట్వీట్ తొలగించిన జనసేన!

  • ఉదయం కీలక ట్వీట్ పెట్టిన జనసేన
  • ఆపై అభిమానుల నుంచి ఒత్తిడి
  • కాసేపటికే మాయమైన ట్వీట్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా రెండు రాష్ట్రాల్లో బలం ఉన్నంత మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ, తన ట్వీట్ ను తొలగించింది. మన బలం 175 స్థానాల్లో ఉంటే 175 చోట్ల మాత్రమే పోటీకి దిగుతామని తొలుత జనసేన ప్రకటించిన తరువాత, పవన్ అభిమానుల నుంచి ఒత్తిడి వచ్చినట్టు సమాచారం.

జనసేన బలాన్ని తక్కువ చేస్తూ చూపేలా ఉన్న ట్వీట్ పై అభిమానుల నుంచి నిరసనలు రావడంతోనే ఆ ట్వీట్ ను తొలగించినట్టు సమాచారం. ఈ ఉదయం 9.57 గంటల సమయంలో 'జనసేన పార్టీ' ట్విట్టర్ ఖాతాలో ఈ ట్వీట్ కనిపించగా, అది వైరల్ అయింది. ఆపై కాసేపటికే ఈ ట్వీట్ జనసేన పార్టీ ఖాతా నుంచి మాయం అయింది. ఇప్పుడా ట్వీట్ ప్రింట్ స్క్రీన్ ఇమేజ్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
pawan kalyan
AP
TS
janasena

More Telugu News