anchor anasuya: మేకప్ లేకపోతే చాలా అసహ్యంగా ఉన్నారు: అనసూయకు షాక్ ఇచ్చిన అభిమాని

  • ఫేస్ బుక్ లైవ్ లో అనసూయకు షాక్
  • ఆగ్రహానికి లోనైన హాట్ యాంకర్
  • ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ ఫైర్
బుల్లి తెర హాట్ యాంకర్, సినీ నటి అనసూయకు ఊహించని షాక్ ఇచ్చాడు ఓ అభిమాని. వివరాల్లోకి వెళ్తే, ఫేస్ బుక్ లైవ్ లో తన అభిమానులతో ముచ్చటించింది అనసూయ. ఈ సందర్భంగా చాలా మంచి పాత్రలు చేస్తున్నారంటూ ఓ అభిమాని కితాబిచ్చాడు. మరో అభిమాని మాత్రం... మేకప్ లో మీరు చాలా అందంగా ఉంటారని, మేకప్ లేకపోతే చాలా అసహ్యంగా ఉంటారని అన్నాడు.

దీంతో, అనసూయ తీవ్ర ఆగ్రహానికి లోనైంది. 'నన్నే ఇలాగంటే... మీరు ఎలా ఉంటారో' అంటూ సమాధానమిచ్చింది. ఇంతకు ముందు సెలబ్రిటీలు ఎప్పుడు బయటకు వస్తారా? అంటూ వాళ్ల ఇంటి ముందు అభిమానులు పడిగాపులు పడేవారని... ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మాకు మేమే వచ్చి మీతో మాట్లాడుతుంటే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 
anchor anasuya
actress anasuya
anasuya bharadwaj
tollywood

More Telugu News