'కేరాఫ్ సూర్య' ఆడియో రిలీజ్ డేట్ ఖరారు
- సందీప్ కిషన్ హీరోగా ' కేరాఫ్ సూర్య'
- కథానాయికగా మెహ్రీన్
- ఈ నెల 5వ తేదీన ఆడియో రిలీజ్
- దీపావళికి సినిమా విడుదల
ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ నెల 5వ తేదీన ఆడియోను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇమ్మాన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో వున్నారు. 'మహానుభావుడు' సినిమాతో యూత్ లో మెహ్రీన్ కి పెరిగిన క్రేజ్ .. ఈ సినిమాకి బాగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు.