railways: ట్రైన్ లో ప్రయాణించిన రైల్వే మాజీ మంత్రికి ఊహించని అనుభవం!

  • శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో ఢిల్లీ వెళ్లిన రైల్వే మాజీ మంత్రి దినేష్ త్రివేదీ
  • ట్రైన్ లో నిమ్మరసం, జ్యూస్, నీరు ఆర్డర్
  • జ్యూస్, నిమ్మరసం బూజుతో కలుషితం  
శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో ఢిల్లీకి ప్రయాణం చేసిన రైల్వేశాఖ మాజీ మంత్రి దినేష్ త్రివేదీకి ఊహించని అనుభవం ఎదురైంది. దసరా నవరాత్రుల నేపథ్యంలో దినేష్ కేవలం మంచినీళ్లు, నిమ్మరసం, జ్యూస్ ఆర్డర్ ఇచ్చారు. తీరా పదార్థాలు ఓపెన్ చేసిన ఆయన షాక్‌ తిన్నారు. దీంతో ఆయన మీడియాకు సమాచారమిచ్చి వాటిని చూపించారు.

ఆ పదార్థాల నిండా బూజు స్పష్టంగా కనిపించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ రోజు దసరా.. నేను నిమ్మరసం తాగుదామని ఓపెన్‌ చేశాను.. చూడండి, లోపల ఏం ఉందో మీరే చూడండి.. ఇది మనం తాగేందుకు ఉపయోగించేదేనా?' అంటూ మండిపడ్డారు. రైల్వే ఛార్జీలు పెంచిన కేంద్ర ప్రభుత్వానికి పరిశుభ్రత, నాణ్యత పట్టడం లేదని ఆయన విమర్శించారు. 
railways
dinesh trivedi
juice
water

More Telugu News