renu desai: పవన్ నుంచి భారీగా డబ్బు తీసుకున్నాననేది కేవలం ప్రచారం మాత్రమే : రేణు దేశాయ్

  • తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన రేణు దేశాయ్
  • పవన్ నుంచి విడాకులు పొందడం బాధాకరమే
  • ఆయన నుంచి భారీగా డబ్బు తీసుకున్నాననేది పుకారు మాత్రమే
  • తాను గానీ .. పవన్ గానీ డబ్బు మనుషులం కాదు         
ఒక టీవీ ఛానల్ వారు నిర్వహిస్తోన్న 'నీతోనే డాన్స్' అనే కార్యక్రమానికి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. దసరా పండుగ సందర్భంగా ఈ కార్యక్రమం మొదలైంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మాట్లాడుతూ, తనకి సంబంధించిన పుకార్లను గురించి ప్రస్తావించారు. పవన్ నుంచి విడాకులు పొందడానికి పరిహారంగా తాను భారీ మొత్తంగా డబ్బు తీసుకున్నట్టు ప్రచారం జరిగిందనీ, అందులో ఎంతమాత్రం నిజం లేదని అన్నారు.

ఇక ఆ డబ్బుతోనే తాను సినిమా తీశాననడం మరింత అవాస్తవమని చెప్పారు. ఈ విషయంలో తన పిల్లలు కూడా తనని అపార్థం చేసుకోకూడదనే ఉద్దేశంతో తాను ఈ నిజాన్ని మీడియా ముఖంగా తెలియజేస్తున్నానని అన్నారు. నిజం చెప్పాలంటే, తాను గానీ .. పవన్ గాని డబ్బు మనుషులం కాదని చెప్పుకొచ్చారు. ఆర్థికపరమైన లావాదేవీలపై తనకి అవగాహన ఉందనీ, అందువలన తన కాళ్లపై తాను నిలబడగలిగానని అన్నారు.         
renu desai

More Telugu News