'సవ్యసాచి' కోసం రంగంలోకి దిగిన కీరవాణి!
- చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి'
- కథానాయకుడిగా నాగచైతన్య
- సంగీత దర్శకుడిగా కీరవాణి
- ఆయన అభిమానులకు శుభవార్త
దాంతో ఇక ఆయన రాజమౌళి సినిమాలకి తప్ప ఇతరుల సినిమాలకి సంగీతాన్ని అందించరని అంతా అనుకున్నారు. అయితే తాజాగా ఆయన మరో సినిమాను అంగీకరించారు. అదే చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'సవ్యసాచి'. నాగ చైతన్య కథానాయకుడిగా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంగీతాన్ని అందించడానికి కీరవాణి అంగీకరించారట. ఆయన సంగీతాన్ని ఇష్టపడే అభిమానులకు ఇది శుభవార్తే.