keeravani: 'సవ్యసాచి' కోసం రంగంలోకి దిగిన కీరవాణి!

  • చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' 
  •  కథానాయకుడిగా నాగచైతన్య
  •  సంగీత దర్శకుడిగా కీరవాణి
  •  ఆయన అభిమానులకు శుభవార్త
'బాహుబలి 2' తరువాత కీరవాణి ఇంతవరకూ మరో సినిమాకి సంగీతాన్ని అందించలేదు. పైగా ఆ సమయంలో ఆయన .. సంగీతం పట్ల అవగాహన లేని దర్శకులతో కలిసి పనిచేయవలసి వచ్చిందనీ, డబ్బు కోసం అలాంటి దర్శకులతో కలిసి పనిచేయవలసి వచ్చిందంటూ వివాదానికి తెరతీశారు. ఇకపై తన మైండ్ సెట్ కి దగ్గరగా వున్న దర్శకులతో మాత్రమే కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు.

 దాంతో ఇక ఆయన రాజమౌళి సినిమాలకి తప్ప ఇతరుల సినిమాలకి సంగీతాన్ని అందించరని అంతా అనుకున్నారు. అయితే తాజాగా ఆయన మరో సినిమాను అంగీకరించారు. అదే చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'సవ్యసాచి'. నాగ చైతన్య కథానాయకుడిగా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంగీతాన్ని అందించడానికి కీరవాణి అంగీకరించారట. ఆయన సంగీతాన్ని ఇష్టపడే అభిమానులకు ఇది శుభవార్తే.    
keeravani

More Telugu News